Home వార్తలు YSRCP Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! విశాఖ మాజీ ఎమ్మెల్యే మళ్ల...

YSRCP Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! విశాఖ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అరెస్టు..!!

YSRCP Leader Arrest: చిట్ ఫండ్ స్కామ్ కేసులో విశాఖపట్నం అధికార వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ ను ఒడిశా రాష్ట్రం భువేశ్వర్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో మళ్ల విజయ ప్రసాద్ ఏపి, తెలంగాణతో పాటు  ఒడిసా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారాలు నిర్వహించారు. డిపాజిటర్లను మోసం చేసిన రూ.1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిసాలో డిపాజిట్దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఆయన సంస్థపై ఫిర్యాదులు అందాయి. దీనిపై ఒడిసా సీఐడీ పోలీసులు 2019లోనే విజయప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406,467, 468, 471, మరియు 120 (బీ) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు పురస్కరించుకుని విశాఖకు వచ్చిన ఒడిశా సీఐడీ పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేజిహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అనుమతితో విజయప్రసాద్ ను ఒడిశాకు తరలించారు.

మళ్ల విజయప్రసాద్ 2009 లో విశాఖ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆయితే ఆయన  ఇటీవల ఏపి ఎడ్యుకేషనల్ అండ్ వెల్పేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైయ్యారు. విజయప్రసాద్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పుడే పార్టీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేశాయి. విజయప్రసాద్ సంస్థ వెల్ఫేర్ సంస్థ, వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హదాలో మోసాలకు పాల్పడ్డాడని నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు విమర్శించారు.

Exit mobile version