Home వార్తలు Minister Balineni: విదేశీ పర్యటనకు మంత్రి బాలినేని.. ప్రైవేట్ జెట్ లో..!! కారణాలు ఏమిటంటే..!?

Minister Balineni: విదేశీ పర్యటనకు మంత్రి బాలినేని.. ప్రైవేట్ జెట్ లో..!! కారణాలు ఏమిటంటే..!?

Minister Balineni: ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రైవేటు జెట్ ఫ్లైట్ విదేశీ పర్యటనకు వెళ్లడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలం వరకూ కరోనా నేపథ్యంలో మంత్రులు పర్యటనలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికార, అనధికార పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంత్రి రష్యా పర్యటనకు సంబంధించి విమానంలో ఆయన ఉన్న ఫోటోను మంత్రి సిబ్బందే షేర్ చేశారు. కారణాలు అన్వేషించకుండా..హాయిగా జీవించండి అనే క్యాప్షన్ ను ట్యాగ్ గా తగిలించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది టీడీపీ నేతలకు మంచి అస్త్రంగా లభించినట్లు అయ్యింది. దీంతో వీరు మంత్రి పర్యటనకు సంబంధించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Minister Balineni: మంత్రి విదేశీ పర్యటన వ్యక్తిగతమా..అధికారికమా..

మంత్రి బాలినేని రష్యా వెళుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇది అధికారిక పర్యటనా, లేక వ్యక్తిగతమా అనే విషయాలను వెల్లడించలేదు. మంత్రితో పాటు ఫ్లైట్ లో అధికారులు ఎవ్వరూ కనబడలేదు. దీంతో ఇది ఆయన వ్యక్తిగత పర్యటనే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ప్రభుత్వ జీవోలను అధికారికంగా విడుదల చేయకపోవడంతో మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలకు సంబంధించి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు లేవు. దీంతో మంత్రి పర్యటనకు సంబంధించి ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. మంత్రి వ్యక్తిగత పర్యటన అయితే రష్యా ఎందుకు వెళుతున్నట్లు, అది ప్రైవేటు జట్ ప్లైట్ లో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మంత్రి పర్యటకనకు సంబంధించి ఆ పార్టీ వర్గాలకు సైతం సరైన సమాచారం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఏదైనా అధ్యయనానికి సంబంధి అధికారక పర్యటన అయితే మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా  ఉండే అవకాశం ఉంది. ఫోటోలో అధికారులు ఏవరూ కనబడటకపోవడంతో వ్యక్తిగత పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంత్రి పర్యటనపై పలు రకాల ఊహగానాలు వెల్లడి అవుతున్న నెపథ్యంలో ప్రభుత్వం నుండి ఏదైనా వివరణ వస్తుందేమో వేచి చూద్దాం.

Exit mobile version