Home వార్తలు బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటాను అని అన్నారు. మే 13 న జరిగే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోవడం ఖాయం. చీపురుపల్లి లో బొత్సా సత్యనారాయణ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.హింసా రాజకీయాలకు ,బాదుడుకు,ఐదేళ్ల సంక్షోభానికి, అరాచకాలుకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. గురువారం చీపురుపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చీపురుపల్లి లో కళా వెంకట్రావు, విజయనగరం పార్లమెంట్ లో అప్పలనాయుడు గెలుపు ఖాయమని అన్నారు. ప్రజాగళం ప్రతి సభకు ప్రజల స్పందన పెరుగుతుంది. వైసిపిని ఇంటికి పంపించాలన్నా సంకల్పం ప్రజల్లో ఉంది. వైసిపి పాలనలో ప్రజల జీవితాల్లో ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రధాని అవినీతిపరుడని బొత్సా సత్యనారాయణ అంటున్నారు. ప్రధాని అవినీతిపై దమ్ము ,దైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ కి పోయినా బటన్ నొక్కాను అని అంటున్నారు.మీరు బటన్ నొక్కి ఇచ్చింది ఎంత ? మీరు దోచేసింది ఎంత అని ప్రశ్నించారు.బటన్ నొక్కితే మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కి అబద్ధాలు చెప్పడం అనే జబ్బు ఉంది అని అన్నారు.

ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన బొత్సా

విశాఖపట్నంను విజయ సాయి రెడ్డి దోచేస్తుంటే నోరు మెదపని వ్యక్తి బొత్సా సత్యనారాయణ. ఆయన తరువాత వచ్చిన సుబ్బారెడ్డి కి కూడా బొత్సా ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవ్వాని తాకట్టుపెట్టిన వ్యక్తి బొత్సా సత్యనారాయణ అని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం కంచుకోట. ఉత్తరాంధ్ర పై ప్రత్యెక ప్రేమ ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం పెత్తనం బొత్సా కుటుంబానిదే ఉంది. ఉత్తరాంధ్ర లో సమర్థులు లేరా ? వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలని పిలుపునిచ్చారు.

Exit mobile version