Home వార్తలు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం మైనార్టీలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.మైనార్టీల మనోభావాలకు వారి ఇజ్జత్,ఇమాన్ కు తోడుగా నిలబడతానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో మైనార్టీలకు పొలిటికల్ రిజర్వేషన్ కల్పించన ఘనత వైసిపికి దక్కుతుంది…ఏకంగా 7 అసెంబ్లీ స్థానాలను మైనార్టీలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని ఉద్ఘాటించారు.మోదీ సమక్షంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చంద్రబాబు మాట్లాడగలరా? రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ..ఇంకా బిజెపిలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు..ఆయన ముదిరిపోయిన తొండ అని ఎద్దేవా చేశారు.

వైసిపి పాలనలో విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

వైసిపి పాలనలో కులం, మతం, ప్రాంతం బేధం చూడలేదు.. పేదరికాన్ని లేని కుటుంబాన్ని మాత్రమే చూశాను.59 నెలలుగా వారి బ్రతుకులు మార్చటం కోసమే అడుగులు వేశాను.వైసిపి మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. 2,31000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. అక్క చెల్లమ్మల బ్యాంక్ ఖాతాలలోకి రూ. 2,70,000 కోట్లును నేరుగా డిబిటీ విధానంలో పంపిణీ చేశామన్నారు. వైసిపి తెచ్చిన విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. . చంద్రబాబు సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో ఇచ్చారని పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలు వారు కాళ్ళ మీద నిలబడేందుకు సున్నావడ్డీ, చేయూత..కాపు నేస్తం,కాపు నేస్తం, 31లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అక్క చెళ్లమ్మల కోసం గతంలో ఇలాంటి పదాలు ఎప్పుడైనా జరిగాయా? రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, ఉచిత పంటల భీమా, పగటి పూట నాణ్యమైన విద్యుత్, గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? స్వయం ఉపాధికి అండగా …ఆటో, టాక్స్ డ్రైవర్లకు వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం..మత్స్యకారులను మత్స్యకార భరోసా ఇచ్చామని పేర్కొన్నారు.14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పదకమైన గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే,ఎంపిలను ఎన్నుకొనే ఎన్నికలు కావు. పథకాలు కొనసాగింపుకు.. పథకాలు ముగింపుకు మధ్య జరగనున్న ఎన్నికలని పేర్కొన్నారు.మే 13 న రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీలకు..175..25 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలను గెలిపించాలని కోరారు.

Exit mobile version