Home వార్తలు జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపి ఎస్సిపిసిఆర్) సభ్యులు బత్తుల పద్మావతి తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవ,సాంకేతిక పరిజ్ఞానం,విద్య,ధైర్య సాహసాలు,పర్యావరణం,క్రీడలు, కళలు,సాహిత్యం,సంగీతం,నృత్యం,పెయింటింగ్,నూతన ఆవిష్కరణలు,నైపుణ్యాలు,నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిలో రాష్ట్ర,జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్న భారత దేశానికి చెందిన ఆసక్తిగల బాలలు జూలై 31 వ తేదీలోపు ఈ వెబ్సైట్, https:/awards.gov.in ద్వారా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించాలని తెలిపారు. కేంద్ర కమిటీ ద్వారా పరిశీలించి ఎంపిక కాబడ్డ బాలలకు న్యూ ఢిల్లీలో 2025 ఏడాది జనవరిలో దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని,జ్ఞాపికను అందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిభ గల ఆయా రంగాల బాలలను విశేష సంఖ్యలో వెన్ను తట్టి ప్రొత్సహించాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పని చేస్తుందని అన్నారు. వివిధ శాఖల ద్వారా వీటిపై అవగాహనా కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేసి ఉధృత ప్రచారం తో రాష్ట్ర బాలల ప్రతిభా,పాఠవాలు దేశంలో ఇనుమడింప చేసేలా చర్యలు చేపట్టేలా అదేశాలు జారి చేశామని వెల్లడించారు.

Exit mobile version