Home వార్తలు YS Viveka: వివేకా హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్ ..

YS Viveka: వివేకా హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్ ..

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. నేడు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు విచారణను పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ చేసిన అభ్యర్ధనను పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ అంగీకరించారు. సీబీఐ అధికారుల అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిల్ అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరిగే విధంగా ఆదేశించారు.

తొలుత సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను, కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర రెడ్డిలను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హజరుపర్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హజరు కాలేదు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీబీఐ చార్జిషీటులో పేర్కొన అభియోగాల వివరాలను పులివెందుల మెజిస్ట్రేట్ నిందితులకు అందజేశారు.   

Exit mobile version