Home వార్తలు Hijab Row: జిల్లాకు తాకిన హిజాబ్ వివాదం..

Hijab Row: జిల్లాకు తాకిన హిజాబ్ వివాదం..

Hijab Row: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. కొద్ది రోజుల క్రితం విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం చేలరేగింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను తాజాగా కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. కళాశాలకు బుర్ఖా ఎందుకు వేసుకొచ్చారు అని ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. విద్యార్ధినుల తండ్రులు, మత పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది, ఈ వివాదాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించారు.

తాజాగా ప్రకాశం జిల్లాలోనూ హిజాబ్ వివాదం చెలరేగింది. యర్రగొండపాలెంలోని ఓ హైస్కూల్ యాజమాన్యం ముస్లిం విద్యార్ధినులను అడ్డుకుని హిజాబ్ తొలగించి స్కూల్ కు రావాలని చెప్పడంతో వివాదమైంది. విద్యార్ధినులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మత పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మత పెద్దలు, విద్యార్థినుల తల్లిదండ్రులు   హైస్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చాలా కాలం నుండి హిజాబ్ ధరించే స్కూల్ కు వస్తున్న తమ పిల్లలను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. హైస్కూల్ యాజమాన్యం తీరును వారు తప్పుబట్టారు. మత పెద్దల ఆందోళనతో స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Exit mobile version