Home వార్తలు APSRTC: ఏపిఎస్ ఆర్టీసీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!!

APSRTC: ఏపిఎస్ ఆర్టీసీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!!


APSRTC: ఏపిఎస్ ఆర్టీసికి తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుంటారు. ప్రయాణీకుల కోసం ప్రత్యేక సర్వీసులను ఆర్ టీసీ ఏర్పాటు చేస్తుంటుంది. అయితే ప్రత్యేక సర్వీసుల బస్సులకు ప్రయాణీకుల నుండి 50 శాతంకు పైగా అదనపు చార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తుంటుంది. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగకు ఏపిఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదనపు చార్జీల వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో ఏపి తదితర ప్రాంత ప్రయాణీకులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ అదనపు చార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఎంబీపీఎస్ నుండి 3400, జేబీఎస్ నుండి 1200 రెగ్యులర్ సర్వీసు బస్సులు నడుపుతుండగా పండుగ వేళ అదనంగా మరో 4322 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

తెలంగాణలోని ప్రాంతాలకు 3338, ఆంధ్రప్రదేశ్ కు 984 బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుండి విశాఖ, విజయవాడ తదితర దూర ప్రాంతాలకు ఏపి, తెలంగాణ ఆర్టీసీ బస్సులలో టికెట్ రేటులో భారీ వ్యత్యాసం ఉండటంతో తెలంగాణ బస్సులో ప్రయాణాలకు ఆంధ్ర ప్రాంత ప్రయాణీకులు మొగ్గుచూపుతున్నారు. అయితే టీఎస్ ఆర్టీసీని చూసి ఏపిఎస్ ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించే అవకాశాలు కనబడటం లేదు. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో రెగ్యులర్ సర్వీసుల మారిదిగా ప్రత్యేక సర్వీసులను నడిపితే ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతుంది. అయితే ఇప్పటికే ఏపిఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్లో 60శాతం పైగా టికెట్లు రిజర్వు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version