Home వార్తలు ANAGANI SATYA PRASAD: స్ఫూర్తి మంత్రం.. స్వచ్ఛ మానవత్వం..! Birthday Special

ANAGANI SATYA PRASAD: స్ఫూర్తి మంత్రం.. స్వచ్ఛ మానవత్వం..! Birthday Special

మంచికి మనిషి రూపముంటే..

ఆ రూపం రాజకీయం చేస్తే..

ఆ రాజకీయానికి రంగు ఉండదు.. కల్మషం తెలియదు.. కుట్ర చేయదు.. కపటం ఉండదు.. స్వచ్ఛమైన రాజకీయం చూపిస్తుంది.. ప్రజల గుండెల్లో చేరుతుంది.. ఆ రూపమే అనగాని.. ఆ రాజకీయమే అనగాని ప్రస్తానం..!!

నమ్ముకున్న కుటుంబాలకు సైనికుడిగా..

ఆదరించిన నియోజకవర్గానికి సేవకుడిగా..

ప్రజల మనసు గెలిచిన పాలకుడిగా..

కార్యకర్తలకు ఆదర్శ నాయకుడిగా..

రేపల్లెకు తిరుగులేని రక్షకుడిగా.. తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు అనగాని..!

ఆయన సేవకు హద్దు లేదు.. ఆయన మంచికి పార్టీ లేదు.. ఆయన సహకారానికి పరిమితి లేదు.. ఆయన మాటకు కల్మషం లేదు.. నిత్యం నవ్వుతూ.. పల్లె పల్లెకూ నడుస్తూ.., స్వచ్ఛమైన మనిషిగా అందరిలో కలుస్తూ.. రేపల్లెలో విరబూసిన స్వచ్ఛమల్లె “అనగాని సత్య ప్రసాద్”

“అనగాని” అనగానే అన్నగా, అండగా ఆదరించే మనసు నీది..

అందరి నోటా అనగాని అని ఆప్యాయంగా పిలిపించుకునే చనువు నీది..

అధికారం ఉన్నా, లేకపోయినా పేదలకు కష్టమొస్తే చలించే తత్వం నీది..

రేపల్లెలోని ప్రతి పల్లెల్లో ప్రగతి పూలు పూయించిన ఘనత నీది..   

నియోజకవర్గ జనమే సొంత కుటుంబంగా భావించే గుణం నీది..

“1972 జనవరి పదో తేదీన హైదరాబాద్ లో అనగాని రంగారావు – నాగమణి దంపతులకు జన్మించిన నాలుగో సంతానం అనగాని సత్యప్రసాద్ పదో తరగతి వరకు ఆ మహా నగరంలోనే చదివారు. ఇంటర్మీడియట్ గుంటూరులో చదివి, మళ్ళీ డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేశారు. అన్నలు శివ ప్రసాద్, అక్కలు మంజుల, కమలలకు ముద్దుల తమ్ముడిగా.., ఇంట్లో చిన్నోడిగా అల్లారు ముద్దుగా పెరిగిన సత్య ప్రసాద్ బాల్యం నుండి పేదల కష్టం చూసి చలించిపోయే వారు. పట్టణాలు, మహా నగరం కంటే పల్లెల్లోనే ప్రజల జీవన శైలి మార్చాలి అనే లక్ష్యంతో అడుగులు వేశారు. అక్కలు ఇద్దరూ ప్రముఖ వైద్యులుగా స్థిరపడ్డారు. సత్యప్రసాద్ మాత్రం యువకుడిగా రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. తద్వారానే తన సేవా లక్ష్యం నెరవేరుతుందని గ్రహించి.. డిగ్రీ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. క్రమంగా తెలుగుదేశం పార్టీలో చేరి.., మొదటి నుండి విభిన్నమైన వ్యక్తిత్వం, సేవా తత్వంతో అందరి మనసులు గెలుచుకున్నారు. 2009లో తొలిసారిగా రేపల్లె నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమితో కుంగిపోకుండా.., మళ్ళీ తన కార్యక్రమాలు కొనసాగించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. నియోజకవర్గంలో పర్యటనలు చేసారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో తిరిగారు. తన శ్రమ, తన సేవ, తన తత్వం, తన స్వభావం ప్రజలకు బాగా తెలిసేలా చేసి, అన్ని వర్గాలకు దగ్గరయ్యారు.

“2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా తన ప్రగతి ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ ఐదేళ్లలో రేపల్లె రూపురేఖలు మార్చారు. పార్టీలు చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు.. హద్దు లేకుండా ఇచ్చారు, అవధులు లేకుండా ఆదరించారు. రాజీ లేకుండా పనులు చేయించారు. ఎవ్వరికీ సాధ్యం కానీ రహదారులు నిర్మించి రేపల్లెకు బహుమతి అందించారు. ఆ ఐదేళ్లల్లో ముఖ్యమంత్రి సహాయనిధి, వివిధ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల ద్వారా రేపల్లెకు రూ. 3 వేల కోట్లు విలువైన పనులు చేయించి, ప్రగతి దాహం తీర్చారు. కొన్ని దశాబ్దాలుగా పరిష్కరించలేని ఎన్నో సమస్యలను పరిష్కరించి.., రేపల్లె జనం గుండెల్లో గూడుకట్టుకున్నారు. మన అనగాని, మన మనిషి అనగాని, మనందరి మనిషి అనగాని” అనే శాశ్వత ముద్ర వేసుకున్నారు. ఆ ఫలితమే 2019 ఎన్నికల్లో కనిపించింది. రాష్ట్రమంతటా వైసీపీ జగన్ గాలి వీస్తున్న సమయంలో.., జగన్ కి అత్యంత సన్నిహితుడితో పోటీ పడి రెండోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎదురుగాలిలో గెలుపు కేవలం ప్రజానాయకుడికే సాధ్యమవుతుంది. ప్రజలు ఆదరిస్తే, జనం గుండెల్లో పెట్టుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో 2019 ఎన్నికల ఫలితాల్లో చూపించారు.    

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిత్యం జనంలో ఉంటూ.., కార్యకర్తల కష్టానికి చలిస్తూ.., ప్రజల కష్టానికి స్పందిస్తూ.., ప్రతి పల్లెలో వందలాది మందిని పేరు పెట్టి పిలిచే చనువు, చొరవతో మంచి మనసు చాటుకున్నారు..  రేపల్లెలో విరబూసిన స్వచ్ఛమల్లె “అనగాని సత్య ప్రసాద్” 

రేపల్లెలో ప్రతి పల్లె మురుస్తుంది..

రేపల్లెలో ప్రతి గుండె పిలుస్తుంది..

రేపల్లెలో ప్రతి ఇల్లు తలుస్తుంది..

రేపల్లెలో ప్రతి మనసు దీవిస్తుంది..

“దీర్గాయుష్మాన్ భవ” అని.. అనగాని వెయ్యేళ్ళు వర్ధిల్లాలని..

అనగాని గురించి కొన్ని ప్రత్యేకతలు..

అనగానికే సాధ్యం 👉 దేశంలో నిత్యం ఆనందంగా ఉండే నేతల్లో అనగానిది మొదటి వరుస.

అనగానికే సొంతం 👉 15 ఏళ్ల రాజకీయం జీవితంలో ఒక్క క్రిమినల్ కేసు లేని ఏకైక నేత అనగాని.

అనగాని ఆదర్శం 👉 వేల కోట్ల పనులు చేసి ఒక్క అవినీతి మరక అంటని ఏకైక ఎమ్మెల్యే అనగాని.

అనగాని స్ఫూర్తి 👉 ఎప్పుడు, ఎవ్వరు ఫోన్ చేసినా ఆప్యాయంగా మాట్లాడే అరుదైన నేత (మిస్ కాల్ ఉన్నా తర్వాత చేస్తారు)

అనగాని కుటుంబం 👉 అక్కలు ఇద్దరూ ప్రముఖ వైద్యులు. డాక్టర్ అనగాని మంజుల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

అనగాని సూత్రం 👉 అనవసర ఒత్తిడి, బాధ, తపన పడే కంటే.. సంతృప్తిగా, ఉల్లాసంగా ఉండడమే..

అనగాని వరం 👉 రేపల్లెలో ప్రతీ పల్లెలో కనీసం 20% మందిని పేరు పెట్టి పిలిచేంత, పిలిపించుకునే చనువైన నేత.

Exit mobile version