Home వార్తలు Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కన్నుమూత..!!

Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కన్నుమూత..!!

Tollywood: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు నేటి సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఈ ఐ జి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్ బాబు తో కలిసి పలు చిత్రాల్లో నటించారు.

నా ఇల్లే నా స్వర్గం, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్, అన్నా చెల్లెలు, చిన్న కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, ఎన్ కౌంటర్ చిత్రాల్లో రమేష్ బాబు నటించారు.1997 నుండి నటనకు దూరంగా ఉన్న రమేష్ బాబు 2004లో నిర్మాతగా మరి అర్జున్, అతిధి మూవీ లను తీశారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేశారు.

Exit mobile version