Home వార్తలు TDP News: దుర్మార్ఘపు పాలన అంతమొందించేందుకు దళితులంతా ఐక్యం కావాలి

TDP News: దుర్మార్ఘపు పాలన అంతమొందించేందుకు దళితులంతా ఐక్యం కావాలి


TDP News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై వివక్షత, భౌతిక దాడులు, బెదిరింపులు అధికం అయ్యాయనీ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు బాపట్ల పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా హాజరైన వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని దుయ్యబట్టారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలన అంతమొందించేందుకు దళితులంతా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు.

దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. దళితుల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వంపై తిరగబడిన వారిని పిచ్చోడు అని ముద్రవేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టి చందన్న పెళ్లి కానుక పథకాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసిందన్నారు. రైతులు తమ ఇబ్బందులు తెలియజేయడానికి వెళితే ఎమ్మెల్యేలు దురుసు గా వ్యవహరించటం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, దామచర్ల సత్య, దేవ తోట నాగరాజు, ఎస్సీ సెల్ నాయకులు దయ బాబు, బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి సరోజిని తదితరులు పాల్గొని ప్రసంగించగా, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హజరైయ్యారు.

ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏలూరి..

స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఏపి (ఎస్ఏఏఏపి) ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ లను టీడీపీ పార్లమెంట్ ఇన్ చార్జి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు. తన కార్యాలయంలో సంఘ నేతల ఆధ్వర్యంలో శనివారం ఏలూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు ఏలూరిని దుశ్సాలువాతో సత్కరించారు. పలువురు అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.

Exit mobile version