Home వార్తలు Road Accident: కడప జిల్లాలో వ్యాన్ బీభత్సం .. నలుగురు మృతి..

Road Accident: కడప జిల్లాలో వ్యాన్ బీభత్సం .. నలుగురు మృతి..

Road Accident: కడప జిల్లా సీకే దిన్నె మండలం మద్దిమడుగులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాను అదుపుతప్పి ఇంటి ముందు కూర్చున్న వారిపై దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. రోడ్డు పనులు చేస్తూ పక్కన కూర్చున్న వారిపై అదుపుతప్పిన వ్యాన్ దూసుకువెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో నలుగురుని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి, దేవి, అమ్ములు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version