Home వార్తలు CM YS Jagan: ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

CM YS Jagan: ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

CM YS Jagan: ఏపిలో సహాకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారా ఇకపై తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ రుణాలు, బంగారు తాకట్టు రుణాలకు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సహకార బ్యాంకుల ద్వారా వీలైనంద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సహకార శాఖపై గురువారం సీఎం జగన్ సమీక్ష జరిపారు. తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడం వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. వెసులుబాటు మేరకు ఎంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని చెప్పారు.

బ్యాంకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలని సూచించారు. ఈ పోటీని తట్టుకునేందుకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలన్నారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలని తెలిపారు. అదే విధంగా బంగారు తాకట్టుపై రుణాలను కూడా వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకులకన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు మళ్లించుకోవాలన్నారు. తద్వారా ఇటు సహకార బ్యాంకులకు, అటు ఖాతాదారులకు మేలు జరుగుతుందని అన్నారు. రుణాల మంజూరులో రాజకీయాలకు తావు ఉండకూడదని తెలిపారు. అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా కేంద్ర సహకార బ్యాంకు కార్యకలాపాలు జరగాలని స్పష్టం చేశారు.

Exit mobile version