Home వార్తలు AP High Court: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

AP High Court: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

 

AP High Court: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై నమోదు అయిన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.  అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ను దూషించారన్న అభియోగంపై అయ్యన్నపాత్రుడి మీద 506 (2), 153(ఏ), 506 సెక్షన్ కింద నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

నిన్న నలజర్ల పోలీసులు అయ్యన్నపాత్రుడికి నివాసానికి చేరుకోవడంతో అరెస్టు చేస్తారని అందరూ భావించారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్న పాత్రుడు నివాసం వద్దకు చేరుకున్నారు.  పోలీసులు వచ్చిన సమయంలో అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేకపోవడంతో వచ్చే వరకూ వేచి ఉంటామని పోలీసులు చెప్పి అక్కడే కూర్చున్నారు. అయితే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు నోటీసులు అందించి వెళ్లిపోయారు. కాగా పోలీసుల చర్యలపై హైకోర్టులో అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది సతీష్ నేడు  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version