Home వార్తలు రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండి నేతలు సన్నద్దం అవ్వాలి – కేసిఆర్

రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండి నేతలు సన్నద్దం అవ్వాలి – కేసిఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదనీ, షెడ్యుల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసిఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవనంలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేసిఆర్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ నేతలు ఈ సమావేశానికి హజరు కాగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసిఆర్ దిశానిర్దేశం చేశారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గా అభ్యర్ధులు పోటీలో ఉంటారని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ఉంది..గట్టిగా పోరాడాలన్నారు. ఇప్పటి నుండే ప్రజా ప్రతినిధులు, నేతల్లో ప్రజల్లో తిరగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రగతి ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ కార్యవర్గం తదితర విషయాలపై చర్చించిన కేసిఆర్.. కీలక సూచనలు చేశారు.

Exit mobile version