Home వార్తలు Chandrababu: చంద్రబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ..త్వరగా కోలుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్

Chandrababu: చంద్రబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ..త్వరగా కోలుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్

Chandrababu: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజు కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో రోజు వారి కేసుల సంఖ్య 3వేల వరకూ ఉండగా, ఏపీలో రోజు వారి కొత్త కేసులు అయిదు వేల వరకూ నమోదు అవుతున్నాయి. సామాన్య ప్రజానీకం మొదలు కోని ప్రముఖులు, సెలబ్రిటీలు , రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి నిన్న కరోనా పాజిటివ్ అని తేలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు కూడా స్వల్ప లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చంద్రబాబే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. హోం ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. తనతో వారం రోజుల నుండి కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

కాగా చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జగన్ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి మాత్రం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.  

యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్‌ వర్థంతి నాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది గానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుండి పోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Exit mobile version