Home వార్తలు MP Raghurama: రేపు ఢిల్లీలో ఎంపి రఘురామ నిరాహార దీక్ష ..! ఎందుకంటే..?

MP Raghurama: రేపు ఢిల్లీలో ఎంపి రఘురామ నిరాహార దీక్ష ..! ఎందుకంటే..?

MP Raghurama: వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు రేపు ఢిల్లీలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గత రెండు సంవత్సరాలకుగా వైసీపీ ప్రభుత్వ విధానాలను, సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ వచ్చిన రఘురామ .. రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం రాత్రి జీవో విడుదల చేసింది. ఈ జివోలను అధ్యయనం చేసిన ఉద్యోగ సంఘాలు తమకు తీరని నష్టం జరుగుతోందని వాపోతున్నారు. రివర్స్ పీఆర్సీ మాకొద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపి జేఏసి, ఏపి జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తిరస్కరిస్తున్నామని ఆ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజులు పేర్కొన్నారు. తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

file photo

ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతు పలికారు. రివర్స్ పీఆర్సీకి నిరసనగా తాను రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ తన నివాసంలోనే దీక్ష చేయనున్నట్లు రఘురామ వెల్లడించారు. ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఏపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అన్నీ అసంతృప్తితో ఉన్నాయని అన్నారు.

Exit mobile version