Home వార్తలు AP Wine Shops: ఏపిలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

AP Wine Shops: ఏపిలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

AP Wine Shops: ఏపిలో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందే మద్యం రేట్లను ప్రభుత్వం తగ్గించింది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా దాదాపు నిలిచిపోయింది. ఇంతకు ముందు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడం, ధరలు పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా, అమ్మకాలు జోరుగా సాగాయి.

ఈ నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా నిరోధించేందుకు ప్రభుత్వం ఇక్కడ మద్యం ధరలను 20 శాతం తగ్గించడంతో పాటు బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా మద్యం దుకాణాల పని వేళలను గంట పొడిగించింది. మద్యం షాపులు మరో గంట పాటు తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఎక్సైజ్ శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి పది గంటల వరకూ మద్యం షాపుల్లో విక్రయాలు సాగించేందుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Exit mobile version