Home వార్తలు Adimulapu Suresh: ఏపిలో పాఠశాల సెలవుల పొడిగింపు.. మంత్రి సురేష్ ఏమన్నారంటే..

Adimulapu Suresh: ఏపిలో పాఠశాల సెలవుల పొడిగింపు.. మంత్రి సురేష్ ఏమన్నారంటే..

Adimulapu Suresh: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు వారి కేసుల నమోదు సంఖ్య తెలంగాణలో రెండు వేలకు పైగా ఉండగా, ఏపిలో అయిదు వేల వరకూ చేరాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. పాఠశాలల సంక్రాంతి సెలవులు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ సెలవులను పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో పక్క ఏపిలోనూ కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పాఠశాలల సెలవులను పొడిగిస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.

పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలల తరగతులను నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెల 18వ తేదీ నుండి ఏపిలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.

Exit mobile version