Home వార్తలు AP High Court: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపి హైకోర్టు

AP High Court: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపి హైకోర్టు

AP High Court: ప్రభుత్వం జారీ చేస్తున్న పలు ఉత్తర్వలు న్యాయ సమీక్షలో నిలువలేకపోతున్నాయి, ప్రభుత్వం తమ వాదనలను సమర్థవంతంగా వినిపించలేకపోతున్నది. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులపై పిటిషనర్ల వాదనలు బలంగా ఉండటంతో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. తాజాగా ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపైనా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ ప్రవేశాలపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించింది. ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. సరైన విధానాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఆన్ లైన్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.  

ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు దశల్లో దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆగస్టు 27వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. రెండవ దశలోనూ ప్రవేశాలను ప్రారంభించిన ఇంటర్ బోర్డు నవంబర్ ఆరువ తేదీ వరకు తుది గడువు గా ప్రకటించింది. అయితే సరైన విధివిధానాలు లేకుండా ఆన్ లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారనీ పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన హైకోర్టు..ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆన్ లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ ను రద్దు చేసింది.

Exit mobile version