Home వార్తలు karamchedu: పంచాయతీలో అక్రమాలు..సర్పంచి నిరసన..!!

karamchedu: పంచాయతీలో అక్రమాలు..సర్పంచి నిరసన..!!


karamchedu: గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏకంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులతో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. ఇంతకు ముందు పంచాయతీ నిర్వహణ సిబ్బంది వేతనాల పేరుతో జరిపిన అక్రమాలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కారంచేడు గ్రామ పంచాయతీ చెరువు మాన్యం లీజ్ లో జరిగిన అవినీతిపై డీఎల్ పిఓ రమణమ్మకు సర్పంచ్, గ్రామప్రజలు ఫిర్యాదు అందజేశారు. సదరు అవినీతికి సంబంధించి రికార్డులను సైతం అందజేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం..2020-21 సంవత్సరానికి గానూ చెరువు మన్యం 32 ఎకరాల 13 సెంట్లు 8 భాగాలకు గానూ పోయిన సంవత్సరం పాట రూ.3,13,000 కౌలుగా వచ్చిందనీ అయితే రికార్డు పరంగా అకౌంట్ పుస్తకంలో 2,49,000 రూపాయలు మాత్రమే జమ చేశారని చెప్పారు. మిగిలిన 64వేల రూపాయల తేడాకు సంబంధించి సదరు రికార్డు పుస్తకంలో కానీ బిల్లు రూపంలో కానీ ఎటువంటి రికార్డులు లేవన్నారు. ఈ లీజ్ విషయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారని ఆరోపిస్తూ వీటిపై విచారణ జరిపి వారి వద్ద నుండి సొమ్ము రికవరీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.

Exit mobile version