Home వార్తలు AP High Court: ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్లు స్వీకరించవచ్చు .. ఏపి హైకోర్టు ఆదేశం

AP High Court: ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్లు స్వీకరించవచ్చు .. ఏపి హైకోర్టు ఆదేశం

AP High Court: ఏపిలో ఎయిడెడ్ కళాశాలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనం పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రైవేశాలు కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పిటిషన్ ల తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అయితే అటువంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొనగా, పిటిషన్ల తరపు న్యాయావాది శ్రీనివాస్ ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక ఆదేశాలను చదివి వినిపించారు. ప్రవేశాలను నిలిపివేస్తే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాలను నిర్వహించుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.

Exit mobile version