Home వార్తలు అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్ కళ్ళారా చూస్తే…కచ్చితంగా వారికి రిజర్వేషన్ కల్పించేవారని అన్నారు. పిఠాపురం వీరవాడ రోడ్ బ్రాహ్మణ అగ్రహారం వద్ద జరుగుతున్న లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రాహ్మణులచే ఆశీర్వచనం పొంది గణపతి హోమం లో పాల్గొన్నారు ప్రస్తుతం బ్రాహ్మణులు అనేక బాధలు ఎదుర్కొంటున్నారని ఇవన్నీ చాలా చిన్న సమస్యలైనా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికైన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలు ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో హిందువుల సొమ్ములు వక్రమార్గం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వక్స్ బోర్డ్ గాని క్రిస్టియన్ మిషనరీలు గాని ప్రభుత్వం ఆధీనంలో లేవని కేవలం హిందూ దేవుళ్ళ గుళ్ళు మాత్రమే ప్రభుత్వం పెత్తనం చెలాయించడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. 90 శాతం హిందువులకే గుళ్ళు గోపురాలు ఆజామాసి ఉండాలని కేవలం 10 శాతం ప్రభుత్వం అబ్జర్వేషన్ చేయాలన్నారు. బ్రాహ్మణులు విద్యలో సంపూర్ణంగా ఉంటారు కానీ సంపాదనలో దీనంగా ఉన్నారన్నారు.రాష్ట్రంలో దేశంలో హిందూమతం బతికి ఉంది అంటే అది కేవలం బ్రాహ్మణుల వల్ల మాత్రమే అని పేర్కొన్నారు తమ కూటమి పార్టీ జనసేన అధికారంలోకి రాగానే ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Exit mobile version