Home మా ఎడిటోరియల్ Online Prakasam: ఆ ముగ్గురు నేతలకు అగ్ని పరీక్ష..! ఓడిపోతే దుకాణం మూసుకోవాల్సిందే..!!

Online Prakasam: ఆ ముగ్గురు నేతలకు అగ్ని పరీక్ష..! ఓడిపోతే దుకాణం మూసుకోవాల్సిందే..!!

Online Prakasam: Tough Situation for These Leaders
Online Prakasam: Tough Situation for These Leaders

Online Prakasam: జిల్లాలో రాజకీయాలకు సీజన్.. అన్ సీజన్ అంటూ ఏమి ఉండదు.. ఎప్పుడూ ఏదో ఒక వార్త, విషయం, వివాదంతో వేడి వేడిగానే ఉంటాయి.. జిల్లాలో కొన్ని నెలలుగా చీరాలలో రాజకీయం అంతుచిక్కని దిశగా మలుపులు తిరుగుతుండగా.., తాజాగా అద్దంకి కూడా అంతే ప్రతిష్టాత్మకానికి చేరింది. కొన్ని నెలలుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యాపారాలు, ఆర్ధిక మూలాలపై అధికార పార్టీ కన్నెర్ర చేస్తుంటే.., టార్గెట్ చేస్తుంటే రాజకీయ కక్షల్లో భాగమేనని చాలా మంది భావించారు.. కానీ ఇది సాధారణమైన చిన్నస్థాయి కక్ష కాదు. సీఎం స్థాయి నుండి మంత్రులు, ఇంచార్జి, అధికారులు అందరూ పెంచుతున్న కక్ష.. ఇక వీటిని చేధించుకుని వచ్చే ఎన్నికల్లో నిలవడం, గెలవడం రవికుమార్ కి అగ్ని పరీక్ష.. ఈయనతో పాటూ వచ్చే ఎన్నికలు జిల్లాలో మరో ముగ్గురు నాయకులకు అత్యంత కీలకం కాబోతున్నాయి. రాజకీయ అగ్నిపరీక్ష పెట్టబోతున్నాయి..!

Online Prakasam: Tough Situation for These Leaders
  • రవికుమార్ రాజకీయం రెండేళ్ల కిందటి వరకు సాఫీగానే సాగింది. 2004 లో తొలిసారి ఎమ్మెల్యే నుండి 2019 వరకు అధికార పార్టీలోనే గడిపారు. తన పనులు, నియోజకవర్గ పనులు, తన వాళ్ళ పనులు బాగానే జరిగేలా చూసుకున్నారు. కానీ 2019 లో ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్రలోకి వెళ్ళాక ఆయన మూలాలు ఒక్కోటీ చెల్లాచెదురవుతున్నాయి. సీఎం జగన్ కి టీడీపీ ఎమ్మెల్యేల్లో మిగిలిన అందరూ ఒక లెక్క, రవికుమార్ ఒక్కరూ ఒక లెక్క.. ముందు తరం నుండి కుటుంబాల మధ్య స్నేహం ఉన్నప్పటికీ.. 2014లో ప్రతిపక్షంలో ఉండగా తనను కాదని టీడీపీలో చేరిన రవికుమార్ పై జగన్ వ్యక్తిగతంగా ఆగ్రవేశాలు పెంచుకున్నారు. ఆ ఫలితమే ఈ రెండేళ్లుగా గొట్టిపాటికి ఎదురవుతున్న వేధింపులు. ఇవి ఆగలేదు. ఆగేవి కాదు. ఇప్పటికె తనకున్న కొన్ని గ్రానైట్ క్వారీలను అధికార పార్టీలోని ఓ కీలక నాయకుడికి అమ్మేసుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనని ఓడించాలని పెద్ద ప్రణాళికలే వేస్తున్నట్టు మంత్రి బాలినేని ద్వారా వెల్లడయింది. గొట్టిపాటిని ఓడించడానికి మూడంచెల వ్యూహం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్ధికంగా బలహీనం చేయడం మొదటిది. తనకు సొంత మనుషులు, కీలక నాయకులుగా ఉన్న వారిని దూరం చేసి, అధికార పార్టీలో చేర్చుకోవడం రెండో దశ. అధికార పార్టీ నేతలు ఈ రెండూ సాఫీగానే అమలు చేయగలిగారు. ఎన్నికల నాటికి రవికుమార్ ని ప్రజాబలం లేకుండా చేయడం.., క్యాడర్ ని చెల్లాచెదురు చేయడం తదుపరి దశలు.. సాక్షాత్తు సీఎం జగన్ స్థాయిలో ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారంటే… ఈ దశలు దాటుకుని.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని పూర్తిస్థాయిలో ఢీకొట్టి గెలవడం రవికుమార్ కి అగ్నిపరీక్ష. వచ్చే ఎన్నికల్లో తానూ గెలవాలి, తానున్న పార్టీ అధికారంలోకి రావాలి. లేకపోతే దుకాణం మూసుకోవాల్సి రావచ్చు..!
Online Prakasam: Tough Situation for These Leaders

Online Prakasam: మరో రకంగా మరో ముగ్గురికి పరీక్షలు..!

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కి వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. 2009, 2014లో వరుసగా రెండు గెలుపులు.., ఆపై 2019 లో అనూహ్య ఓటమి తర్వాత ఆమంచి రాజకీయం మలుపులు తిరుగుతూ ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. కొన్ని రాజకీయ మార్పులతో అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా పోరాడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రస్థాయి నాయకత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.., జిల్లాలో కొందరు నాయకులతో విబేధాలు కారణంగా పార్టీలో తన సొంత క్యాడర్ కి ఇబ్బందులు తప్పడం లేదు. పర్చూరు ఇంఛార్జిగా వెళ్ళాలన్న పార్టీ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించి.., తన సొంత ప్రాంతం చీరాలలోనే, చీరాలతోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. తనను నమ్ముకున్న, తను నమ్మిన సొంత క్యాడర్ ని కాపాడుకుంటూ సైలెంట్ రాజకీయం నడుపుతున్నారు. వచ్చే ఎన్నికలు ఈయనకు అగ్ని పరీక్ష. వైసీపీ తరపున పోటీ చేసినా.., స్వతంత్రంగా పోటీ చేసినా గెలవడం మాత్రం తన రాజకీయ భవిష్యత్తుకి అవసరం. లేకుంటే ప్రాభవం కోల్పోయి, సొంత క్యాడర్ ని సైతం కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. రాజకీయ శత్రువులు, మిత్రులు ఎక్కువగా ఉన్న ఆమంచికి వచ్చే ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం. లేకుండా దుకాణం మూసుకోవాల్సి రావచ్చు..!

  • అదే చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వారి కుమారుడు వెంకటేష్ కి కూడా వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష.. 2019 ఎన్నికల ముందు వరకు అద్దంకిలో తమ శాశ్వత ప్రత్యర్థి రవికుమార్ పై పోటీకి సిద్ధపడి.., ఏదో ఒకటి తేల్చుకోవాలన్న దశలో ఊహించని రీతిలో చీరాల వెళ్లాల్సి వచ్చింది. సొంత బలం, బలగం మొత్తం అద్దంకిలో ఉంచుకుని.. 2019 ఎన్నికల్లో కృత్రిమ బలంతో చీరాలలో భారీ గెలుపు చూసారు. ఆ తర్వాత కొన్ని సమీకరణాలు, కారణాలతో పార్టీ మారారు. “2014 లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బలరాంని పెద్దగా పట్టించుకోకపోవడం.., చీరాల లాంటి నియోజకవర్గంలో ఆమంచి లాంటి ప్రత్యర్థి అధికార పక్షంలో ఉన్నప్పుడు పోరాడానికి తగిన బలం, బలగం లేకపోవడం.., అధికార పార్టీలో కొందరు నేతల నుండి ఆహ్వానాలు అందడంతో పార్టీ మారిపోయారు. కానీ చీరాలలో పూర్తిగా పునాదులు నిర్మించుకోలేదు. అధికారం అండ, జిల్లా నాయకత్వం ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. చీరాలలో పట్టుపెంచుకునే దిశగా వెంకటేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. భిన్న వర్గాలు, భిన్నమైన నాయకులూ, ఎక్కువగా వివాదాలు, సున్నితమైన రాజకీయ అంశాలు ఉన్న చీరాల నియోజకవర్గంలో సొంతంగా బలం పోగేసుకుని గెలవడం కత్తిమీద సాము వంటిది. 2014 లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్.. మరో సారి పోటీ చేసి ఓడిపోతే ప్రతిష్ట మసకబారుతుంది. అందుకే 2024 లో ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా గెలవడం మాత్రం ముఖ్యం. లేకపోతే దుకాణం మూసుకోవాల్సిందే..!
Exit mobile version