Home వార్తలు మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ?...

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి మన హక్కు కాదా? జగన్ తాతల ఆస్థినా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ప్రజల భూమి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్ధ ఉంటాయి.పసుపు కుంకుమ కింద భూమిని ఇవ్వాలన్నా ఒరిజినల్ పత్రాలు కావాలి. ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం అని ప్రశ్నించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, కాకినాడ ఎంపి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బిజెపి ఇంఛార్జి కృష్ణంరాజు లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….రానున్న ఎన్నికల్లో వైసిపికి ఓటు వేస్తే అందరి ఆస్తులు పోతాయని హెచ్చరించారు. ఓటు ద్వారానే ల్యాండ్ టైటిలింగ్ అడ్డుకోవాలని పిలుుపునిచ్చారు.సాగు నీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

వైసిపి పాలనలో దౌర్జన్యాలు.. దాస్టికాలు

రాష్ట్రంలో వైసిపి నాయకుల దౌర్జన్యాలు దాస్టికాలు పెరిగిపోయాయి. చంద్రబాబును అకారణంగా అరెస్ట్ చేయడం బాధనిపించింది. జైలులో ఆయన్ను కలిసినప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. రాజకీయంలో ఎన్ని దెబ్బలు తగిలినా ముందుకు వెళ్లాలని అన్నారు. జైలు నుంచి బయటకు రాగానే మనసుతో స్పందించి పొత్తు ప్రకటన చేశానని అన్నారు.వైసిపి వ్యతిరేఖ ఓటు చీలనివ్వనని చెప్పాం.అందులో భాగంగానే మమ్మల్ని మేము తగ్గించుకొని పొత్తు ప్రకటన చేశామని తెలిపారు.పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని త్యాగం చేసిన వర్మ ను చట్ట సభల్లో ఉండే విధంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Exit mobile version