Home వార్తలు AP Govt: ఏపిలో నైట్ కర్ఫ్యూ వాయిదా.. సంక్రాంతి తరువాత నుండి అమలు

AP Govt: ఏపిలో నైట్ కర్ఫ్యూ వాయిదా.. సంక్రాంతి తరువాత నుండి అమలు


AP Govt: ఏపిలో నేటి రాత్రి నుండి అమలు చేయనున్న నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో పల్లెలకు వచ్చే అవకాశం ఉన్న రాత్రి కర్ఫ్యూను పండుగ తరువాతకు వాయిదా వేశారు. ఈ నెల 18వ తేదీ నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా మూడవ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో విధిగా మాస్కులు ధరించాలనీ, మాస్క్ లు ధరించకపోతే రూ.100లు జరిమానా విధిస్తారని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరాంచాలని మంత్రి కోరారు.

వ్యాపార వాణిజ్య సంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.10 వేల నుండి రూ.25 వేల వరకూ జరిమానా విధంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినిమా హాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసి సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.

Exit mobile version