Home వార్తలు AP CID: ఎంపి రఘురామకు ఏపి సీఐడీ నోటీసులు..! ఎందుకంటే..?

AP CID: ఎంపి రఘురామకు ఏపి సీఐడీ నోటీసులు..! ఎందుకంటే..?

AP CID: ఏపీ సీఐడీ అధికారులు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది. గతంలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద రఘురామపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే ఆ కేసులో అరెస్టు అయిన రఘురామ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ కేసులో విచారణ కు రావాలని ఈ రోజు నోటీసులు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం   రఘురామ ఇంటికి సీఐడీ అధికారులు చేరుకుని నోటీసులు అందజేశారు. ఈ నెల 13 లేదా 17న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు రావాలంటే ఎలా అని రఘురామ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు.

సీఐడీ నోటీసులు జారీ చేయడంపై రఘురామ ఫైర్ అయ్యారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ గత కేసులపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని చెప్పారు. తన నియోజకవర్గం నర్సాపురంలో రెండు రోజుల పర్యటనకు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చానని తెలిపారు. ఇన్నాళ్లు అడగకుండా ఇప్పుడు పండుగ సమయంలో నోటీసులు ఇవ్వడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 17న విచారణ హజరు అవుతానని తెలిపారు. ఇదే సందర్భంలో జగన్ సర్కార్ పై మరో సారి తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు.

Exit mobile version