Home వార్తలు Bharat Biotech: శ్రీవారికి భారీ విరాళం అందజేసిన భారత్ బయోటెక్..

Bharat Biotech: శ్రీవారికి భారీ విరాళం అందజేసిన భారత్ బయోటెక్..

Bharat Biotech: తిరుమల శ్రీవారికి భారత్ బయోటెక్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.2 కోట్ల విరాళాన్ని అందజేసింది. భారత్ బయోటెక్ సంస్థ అధినేత శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు నేడు విరాళం చెక్కును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలకు అందజేశారు. అనంతరం వారు శ్రీవారి సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం దాతలకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వేళ పెద్ద ఎత్తున కోవాగ్జిన్ టీకా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. భారత దేశానికే కాక ఇతర దేశాలకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వేకువజాము నుండే ప్రారంభమయ్యాయి. వేకువజాము 1.45 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. తొలుత ప్రొటోకాల్ ప్రకారం వీఐపీలకు శ్రీవారి దర్శనానికి అనుమతించారు. అనేక మంది రాజకీయ, సినీరంగ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.

Exit mobile version