Home వార్తలు AP Assembly budget session: గవర్నర్ ప్రసంగంలో టీడీపీ సభ్యుల నిరసన

AP Assembly budget session: గవర్నర్ ప్రసంగంలో టీడీపీ సభ్యుల నిరసన


AP Assembly budget session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి వేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ సభ్యుల నిరసనపై సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కరోనా కారణంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులు తదితర అంశాలను ప్రస్తావించారు. ముందుగా అసెంబ్లీ ప్రాంగణానికి తొలి సారిగా విచ్చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇతర మంత్రులు స్వాగతం పలికారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. మరి కొద్ది సేపటిలో కేబినెట్ భేటీ జరగనుంది. కాగా పది నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు సమావేశం నుండి బాయ్ కాట్ చేశారు.

Exit mobile version