Home వార్తలు Anagani: ఘనంగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని జన్మదిన వేడుకలు

Anagani: ఘనంగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని జన్మదిన వేడుకలు

Anagani: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను సోమవారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు హజరై అనగానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనగాని కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తదుపరి రేపల్లెలో పరిటాల యువసేన కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి, ఏలూరి, దామచర్ల సత్యలు నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించారు. బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు దండమూడి ధరణి కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు.

కాగా అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను ఏలూరి క్యాంపు కార్యాలయంలో, నాగులపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే ఉగ్రహనరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్య, సీనియర్ నాయకులు తొండెపు ఆదినారాయణ, కామేపల్లి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version