Home వార్తలు పిల్ల చేష్టలు, పిచ్చి మాటలతో సైకోలా చంద్రబాబు : సజ్జల రామకృష్ణారెడ్డి

పిల్ల చేష్టలు, పిచ్చి మాటలతో సైకోలా చంద్రబాబు : సజ్జల రామకృష్ణారెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఫ్రస్టేషన్‌ బాగా పరాకాష్టకు చేరిందనేది గత వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోంది. తాను కలలు కన్న కూటమి, పొత్తు వికటించడంతో ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పొత్తు , సీట్ల ఖరారు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ తన కూటమిలో ఉన్న పార్టీలు తన కింద పనిచేసే వాళ్లని చంద్రబాబు భావిస్తున్నారనీ మండిపడ్డారు. ఈయన ఎవరనుకుంటే అభ్యర్థులు ఆయా పార్టీల్లో వాళ్లే అవుతున్నారు. అసలు ఆయా పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జనసేన అనే పార్టీకి ఒక్క పవన్‌ కల్యాణ్‌ తప్ప ఉనికే లేకుండా పోయింది అని తెలిపారు. ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చడం, అప్పటికప్పుడు కండువాలు కప్పడం చూస్తూనే ఉన్నాం. జాతీయ స్థాయి పార్టీలోనూ చంద్రబాబు అనుకున్నట్లే సీట్లు ఖరారు అవుతున్నాయి. ఆ పార్టీలను నమ్ముకుని ఉన్న వారందరికీ నిరాశ, ఆగ్రహాన్ని కలిగించాయి. అవి రచ్చకెక్కడంతో జరుగుతున్న గొడవలు, గందరగోళాలు కన్పిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చివరకు మరో నెలా 8 రోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికల కంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలు అవుతోంది. ఏపీ రాజకీయ తెరమీద ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతోంది. ఇవన్నీ స్పష్టంగా కనిపించడంతో చంద్రబాబు గంగవెర్రులెత్తుతున్నారు. శివాలెత్తిపోతున్నారు. రెండు రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు విమర్శలు, ఆరోపణలు ఏమైనా చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు సంబంధించిన ఎజెండాపై ఏమైనా మాట్లాడొచ్చు. పిల్ల చేష్టల్లా, పిచ్చివాడిలా పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును సైకో అనాలా అని ప్రశ్నించారు.జనం ఏమనుకుంటారో, మొహం మీద ఉమ్మేస్తారనేది కూడా లేకుండా తయారయ్యాడు. చంద్రబాబు తిరుపతిలో మాట్లాడుతూ బీజేపీతో పొత్తులో ఉండి..వరప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా ఓటేయండి అంటున్నాడు. ఈయనే బీజేపీలో అభ్యర్థిగా చంద్రబాబే పెట్టాడు. కానీ మర్చిపోయి బీజేపీకి ఓటేయవద్దంటున్నాడు.

వ్యవస్థలపై ఒత్తిడి పెట్టడం బాబుకు అలవాటే

వ్యవస్థలపై ఏ రకంగా వత్తిడి పెడుతున్నాడో ప్రజలంతా గమనించాలి అని తెలిపారు. 2019లో కూడా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు అప్పటి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిపై ఏ విధంగా చిందులు వేశాడో అందరూ చూశారు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో ప్రస్టేషన్లో ఉన్నాడనుకోవచ్చు. గతంలో అధికారంలో ఉండి కూడా ఆయన వ్యవస్థలపై ఇలానే దాడి చేశాడు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక వ్యవస్థపై ఇలా మాట్లాడిన సందర్భాలు ఎన్నడూ చూడలేదు. ఈ రోజు వీళ్లు ఎడా పెడా ఫిర్యాదులిస్తుంటే..బదిలీలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల్లో అవాస్తవాలు ఉన్నా ఆ వ్యవస్థను జగన్‌ మాట్లాడలేదు అని పేర్కొన్నారు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లిన తర్వాత వారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించకూడదనే గౌరవాన్ని ఆయన పాటిస్తున్నారు.

వాలంటీర్లను ఆపావు కానీ..పింఛన్లను ఆపగలిగావా?

వృద్ధుల పింఛన్ల విషయంలో చంద్రబాబు చేసిన దాష్టీకం అందరూ గమనించారు. పింఛన్లు పంపిణీ ప్రారంభం కావడానికే ముందు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ అందరూ విషప్రచారం ఎలా చేశారో అందరూ గమనించారు. మేం ముందు నుంచీ భయపడుతున్నట్లే..ఎన్నికల పేరు చెప్పి వారిని దూరం చేశారు. దీనివల్ల ఆయన సాధించింది ఏమీ లేదు. నాలుగేళ్లుగా వాళ్లు ఇస్తూనే ఉన్నారు. వారి ప్రభావం ఉంటే ఆ రోజు నుంచే ఉండేది. వాలంటీర్లను ఆపావు కానీ…పింఛన్లను అయితే నువ్వు ఆపలేవుగా? అని ప్రశ్నించారు.శక్తి ఉంటే అవి కూడా ఈ సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ లాంటి సంస్థలతో ఆపించేవాడే. ఆ ధైర్యం చాలలేదు. నిమ్మగడ్డ రమేష్‌ను అనే తన ఏజెంట్‌ రంగంలోకి దింపి ఈ వ్యవస్థపై ఎటాక్‌ చేయించాడు అని ఆరోపించారు.

Exit mobile version