Home వార్తలు వివేకానంద రెడ్డి హత్యను రాష్ట్ర సమస్యగానే చూసాను : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్యను రాష్ట్ర సమస్యగానే చూసాను : సునీత రెడ్డి

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది బాగుండాలి.హత్యలు ,మానభంగాలు ఉండకూడదు. వివేకానంద రెడ్డి హత్య ను కూడా తాను వ్యక్తిగత అంశంగా చూడలేదు. రాష్ట్ర సమస్య గానే చూశానని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర ఆదివారం కమలాపురం నియోజకవర్గ లోకి ప్రవేశించింది. పిసిసి అధ్యక్షులు షర్మిలకు మద్దతు తెలుపుతూ సునీత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ…కడప పార్లమెంట్ విషయంలో వివేకానందరెడ్డిను పక్కకు పెట్టాలని అవినాష్ రెడ్డి చూశారు. ఎంత పక్కకు పెట్టాలని చూసినప్పటకి అయన ప్రజాసేవ మానుకోలేదు. ఏం చేయాలో తెలియక మసిషేనే లేకుండా చేస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో కొన్ని నెలల పాటు పథకం పన్ని ఆయన్ని హత్య చేశారని ఆమె వాపోయారు. వాళ్ళ అరాచకాలు అర్థం చేసుకొని షర్మిల ను ఎంపి గా పోటీ చేయమని వివేకానంద రెడ్డి చెప్పారు.కానీ షర్మిల పోటి చేయలేదని పేర్కొన్నారు.

మన ప్రాంతానికి ఎంపి గా షర్మిల ఉంటే రాజశేఖర్ రెడ్డి లాంటి నేతను మళ్ళీ చూసేవాళ్ళమని ఆయన ఎప్పుడూ భావించేవారని పేర్కొన్నారు. వివేక హత్య సునీత రెడ్డి వ్యక్తిగత అంశం అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అంటున్నారు. ఇది కడప జిల్లా ప్రజలకు సంబంధించిన అంశం కాదా అని ఆమె ప్రశ్నించారు.సిఎం ఎం చెప్పాలని అనుకుంటున్నారో ఆ మాటలన్నీ తన సలహాదారులు చేత చెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పైందిస్తూ….వివేకానంద రెడ్డి హత్య జరిగితే పక్కన చూస్తూ ఉంటారా? అవినాష్ రెడ్డి పాలు తాగే పిల్లాడా? మీకు బాధ్యత లేదా ? అని నిలదీశారు. సొంత వాల్లనే పట్టించుకోని వారు…మీ ( ప్రజలనుద్దేశించి ) గురుంచి ఎం పట్టించుకుంటారో ఆలోచించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. మీరు ఎన్నుకొనే వాళ్ళు మీ గురుంచి పట్టించుకొనే వారు అయ్యి ఉండాలని తెలిపారు.మీ కోసం మీ ప్రయోజనాల కోసం పని చేసే షర్మిలను గెలిపించాలని కోరారు.

Exit mobile version