Home వార్తలు డబల్ సెంచరీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా ? : జగన్మోహన్ రెడ్డి

డబల్ సెంచరీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా ? : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175 కు 175 ఎమ్మెల్యేలు, 25 కు 25 ఎంపీ సీట్లు మొత్తం 200 సీట్లలో గెలిచి డబులు సెంచరీ సర్కార్ స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం సభలో హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆదివారం మేమంతా సిద్ధం 10 వ రోజు బస్సు యాత్ర‌లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వద్ధ కొనకనమిట్ల సభలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ…జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగేవి కాదు. ఈ ఎన్నికలు పిల్లల వారి చదువు, అక్కచెల్లెమ్మల సాధికారత, రైతుల సంక్షేమం, పేద వర్గాలకు న్యాయం వంటివన్ని కొనసాగించాలా.. లేదా వెనక్కి వెళ్లాలా అని, మన భవిష్యత్తు ను నిర్ణయించే ఎన్నికలు అని పేర్కొన్నారు.ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టిన వారని ఒడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా ? ప్రజల రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళల రాజ్యాని, పిల్లల రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు.

పేదలకు ,మోసాలకు జరిగే ఎన్నికలు

రానున్న ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. ఇది పేదలకు మోసాలకు మధ్య జరిగే ఎన్నిక, మీ బిడ్డ జగన్ పేదల పక్షం.. కాబట్టి ప్రతి ఒటు మీ కుటుంమంతా వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం కొనసాగాలంటే జగన్ కి ఒటు వేయలి, రద్దు చేయాలనుకుంటే చంద్రబాబుకు వేయాలి అని తెలిపారు.

చంద్రబాబు మార్క్ రాజకీయం ఎంటో తెలుసా ?

చంద్రబాబు దారి అడ్డ దారి, బాబు విలువలు పాతాళంలోనే ఉంటాయి, విలువలు, విశ్వనీయత అంటే తెలియదు అని మండిపడ్డారు. చంద్రబాబు మార్క్ రాజకీయమేమింటి అంటే అబద్ధాలు, కుట్రలు, మోసాలు అని ధ్వజమెత్తారు. తన మనిషి నిమ్మగడ్డతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు, పేదవారికి ఇంటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్ అవ్వకూడదు అంటా, అలా చేస్తే నేరం అంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క స్కీమైనా గుర్తువస్తుందా?

పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పేరు చెబితే పేదలకు మంచి చేసినట్లు చెప్పుకోవటానికి లేని వ్యక్తి చంద్రబాబు మన ప్రత్యర్ది, మరో వంక మీ బిడ్డ ప్రతి గ్రామంలో, ఇంటి ఇంటికి, అక్కచెల్లమ్మలకు, పిల్లలకు, అవ్వతాతలకు నేరుగా బటన్ నొక్కి రూ. 2.70 లక్షల కోట్లు అందించాం. మెనిఫేస్టోలోని 99శాతం వాగ్ధానాలను అమలు చేసి చూపించి ప్రజలముందు సిద్ధం అంటు వచ్చాం. జగన్ మార్క్ ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో స్థాపించాం అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాను 26 జిల్లాలుగా చేశాం.గ్రామ, పట్టణాల్లో సచివాలయాలు కనిపిస్తున్నాయి. కొత్తగా 4 పోర్టులు, 10 కొత్త ఫిషింగ్ హార్బరలు నిర్మాణాల్లో ఉన్నాయి, 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి.. ఇవన్నీ జరిగింది మీ బిడ్డ హయంలో మాత్రమే అని పేర్కొన్నారు.
చంద్రబాబు దోచుకోవటానికి, దోచుకున్న పంచుకోవటానికి అధికారాన్ని ఉపయోంగిచాడు.. తేడా గమనించండి, అదే బడ్జెట్, అదే రాష్ట్రం.. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేశారు. 2014లో టీడిపి జన సేన,బీజీపీ ముగ్గురు కూటమిగా ఏర్పాడ్డారు, చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ ఫోటోలతో ముఖ్యమైన హామీలు అంటు ప్రతి ఇంటికి పంపించారు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రైతుల రుణమాఫీ పై సంతకం చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నారు చేశారా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా? ప్రత్యేక హోదా ఇచ్చారా? ఏ ఒక్క హామీ నేరవేర్చకపోయారు? సూపర్ సీక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు అని గుర్తు చేశారు.

మేలు జరిగింది అని చెప్పటమే గీతాంజలి చేసిన పాపమా ?

వైసిపి ప్రభుత్వం వల్ల తనకి మేలు జరిగిందని చెప్పటమే గీతాంజలి చేసిన పాపం అయింది అని, సైకోలతో వేధించి ప్రాణం తీసిన శ్యాడిస్టు చంద్రబాబు అని మండిపడ్డారు.

చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తి స్తున్న వాలంటిర్ల వ్యవస్థ

గత 56 నెలలుగా పింఛన్ ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది, చంద్రబాబు ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు, మీ బిడ్డ మాత్రమే చేపట్టాడు.. చంద్రబాబు వెయ్యి రూపాయిలు ఇచ్చిన రోజుల నుంచి మీ బిడ్డ ప్రభుత్వంలో రూ. 3000 పింఛన్ ఇస్తు అవ్వతాతల ముఖంలో ఆనందం తీసుకువచ్చాడు.చంద్రబాబు ఇచ్చే రూ. 1000 కోసం క్యూలైన్లో నిలుచుని నరకయాతన పడిన రోజులు చూశాం. కానీ బిడ్డ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి చిక్కటి చిరునవ్వుతో ప్రతి నెల1వ తేదీని ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అందుకే వారి పై ఫిర్యాదు చేసి, అవ్వతాతలను, దివ్యంగులను ఇబ్బంది పెట్టి దాదాపు 30మంది పై మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడను శ్యాడిసస్టు అని కాకుండా ఇంకేం అంటారు. మన హయంలో ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దే ఇచ్చిపోయే పింఛన్ ను నేడు ఆపారు, 14 ఏళ్ల పాలనలో ఏనాడు పింఛన్ ఇంటికి ఇవ్వని బాబు కుట్రలతో, కుతంత్రలతో ఆపించాడు.. కాబట్టి దొంగల ముఠాలను అడుగుతున్న శ్యాడిస్టు అంటే ఎవరు? .చంద్రబాబుకు ఒటు వేయటమంటే పులి నోట్లు తల పెట్టినట్లే, రాష్ట్ర ప్రజలను, మన పేదలను, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Exit mobile version