Friday, April 26, 2024
Home వార్తలు వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద...

వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో వరంగల్లు జిల్లా చెన్నరావుపేట టీఆర్ఎస్ నేతల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయగా అమె కారు పాక్షికంగా ద్వంసం అయ్యింది. ఆ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ కు పంపించి వేశారు. పాదయాత్రను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు వైఎస్ఆర్ టీపీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.

ప్రగతి భవన్ (సీఎం కేసిఆర్ కార్యాలయం) వద్ద నిరసన తెలియజేసేందుకు ఈ రోజు షర్మిల నిన్న ద్వంసమైన కారులోనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరగా పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో రాజ్ భవన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆమె కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. సీఎం కేసిఆర్ కు అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సమయంలో పోలీసులు షర్మిలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె ఎంతకీ వెనక్కు తగ్గలేదు. మరో పక్క భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆమెను కారు దించే ప్రయత్నం చేయగా కారు కిటికీలు మూసివేసి ఎంతకూ బయటకు రాలేదు. పలువురు కార్యకర్తలు కారు ఎక్కి నిరసన తెలియజేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిరసన తెలియజేస్తున్న 15 మంది వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. షర్మిల కారులో ఉండగానే పోలీసులు క్రైన్ ను తెప్పించి అక్కడ నుండి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా కారు డోర్ లు బద్దలు కొట్టి ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ లోపలకు తరలించారు. ఈ సందర్భంగా షర్మిలపై పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న అభియోగాలపై ఐపీసీ 353, 333, 337 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటుండగా, స్టేషన్ వద్ద ఎవరూ గూడిగూడకుండా పోలీసులు కార్యకర్తలను తరిమివేశారు. షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు పరిసర ప్రాంతాలో పెద్ద ఎత్తున మోహరించారు. మరో పక్క వైఎస్ షర్మిల ఉన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్ విజయమ్మ బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోటస్ పాండ్ వద్దనే విజయమ్మను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...