Saturday, May 4, 2024
Home వార్తలు ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

- Advertisement -

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారని తెలిపారు. మోడీ, చంద్రబాబు సారధ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.గురువారం విజయవాడ హయత్ ప్యాలెస్ లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైకాపా పాలనలో ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా ఏపీ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన అభివృద్ధి లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం వేల కోట్లను ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన గృహాలును ప్రజలకు అందించలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారు. 25 ఎంపీ స్థానాలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకే వస్తాయని తెలిపారు.వచ్చే ఐదేళ్లు ఎపి లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అందరూ‌ చూస్తారు. స్పెషల్ కేటగరీ స్టేటస్ కంటే ఎక్కువ లబ్ధి జరిగింది ఏపీకి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....