Sunday, May 5, 2024
Home వార్తలు సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

- Advertisement -

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ను వినియోగించుకొని విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. గతంలో విద్యలో వెనుకబాటుతనం, వైఫల్యాలను ఎదుర్కొన్న సదరు విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశ నోటిఫికేషన్ చక్కని తోడ్పాటు అందించిందన్నారు. విద్యార్థులు పదో తరగతిలో పునః ప్రవేశం పొందడం ద్వారా ఉన్నత స్థాయి తరగతుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడమే గాక మరింత పట్టుదలగా చదివి మార్కుల్లో గణనీయమైన పెరుగుదల చూపించారన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించి 2023లో పదో తరగతిలో పొందిన మార్కులను, ప్రస్తుతం పొందిన మార్కులకు తేడా చూపిస్తూ వారి ప్రగతిని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.

ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఒక విద్యార్థిని హాల్ టికెట్ నంబర్ 2415101830 505 మార్కులు (84 శాతం) సాధించింది. ఇదే విద్యార్థిని 2023లో కేవలం 266 మార్కులు (44 శాతం) మాత్రమే సాధించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్, కొత్త మార్గదర్శకాలు, అవకాశాలను వినియోగించుకొని సదరు విద్యార్థి సక్రమంగా పాఠశాలలో అన్ని తరగతులకు హాజరై, అన్ని సబ్జెక్టులను బాగా చదివి మంచి మార్కులు సాధించడం విశేషమన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ జీవో నెంబర్ 50 తో పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. చదువులో వెనుకబడిన, మార్కుల్లో వైఫల్యం చెందిన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చిన ఈ సంస్కరణను వారి భవిష్యత్ కు మంచి మార్గంగా ప్రవీణ్ ప్రకాష్ అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...