Home వార్తలు అధికారులపై జగన్ రెడ్డి ఒత్తిడి : బోండా ఉమా

అధికారులపై జగన్ రెడ్డి ఒత్తిడి : బోండా ఉమా

రేపు ప్రభుత్వం నాదే వస్తుంది.నేను చెప్పినట్లు చేయండి. నేను చెప్పినట్లే జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాలను బెదిరిస్తున్నారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు.మంగళవారం మంగళగిరి లో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఫించన్లు పంపిణీ పై చీఫ్ సెక్రెటరీ కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ ల ఇంటికి ఈవిఏం లను పంపేందుకు ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల కమిషన్ … రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్ళి ఫించన్ ఇచ్చేందుకు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలని కోరారు. ఫించన్ దారుల ఇంటింటికీ వెళ్ళి పెన్షన్ లు ఇవ్వండని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం వద్ధ వాలంటీర్లు తప్పా మరో శాఖ ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. పెన్షన్ లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు. అనేక శాఖల వద్ద లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ…. ఫించన్లు ఇవ్వటానికి వ్యక్తులు లేరని వంకతో వికృత రాక్షస రాజకీయ క్రీడ ను మొదలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతుంటే …ఫించన్లు తీసుకోవడానికి సచివాలయం కు వెళ్తే పండుటాకులుగా రాలిపోతే ఎవరు సమాధానం చెప్తారు? వారి ప్రాణాన్ని ఎవరు కాపాడుతారు అని నిలదీశారు.

Exit mobile version