Home వార్తలు ఫించన్లు అందించాలిని ఆదేశాలు ఇవ్వండి : చంద్రబాబు

ఫించన్లు అందించాలిని ఆదేశాలు ఇవ్వండి : చంద్రబాబు

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా పెన్షన్ దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆయన లేఖ రాశారు. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లేందుకు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయవద్దని సెర్ఫ్ సి.ఈ.ఒ. మురళీధర్ రెడ్డిపై వైసిపి ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. ఇంటింటి పెన్షన్ లు అందకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం అని ఆపాదిస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మురళీధర్ రెడ్డి బంధువు.గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల్లో ఆయన సహ నిందితుడిగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే పెన్షన్ల పంపిణీ జరిపేలా సెర్ప్ సీఈవో ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

లబ్దిదారులను ఇబ్బందిపెట్టే ఈ ఆదేశాలలో కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీలకు మించి ఎండలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ దారులు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బంది కలిగిస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని…ఇంటి వద్ద పింఛను అందించే ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version