Home వార్తలు వర్గీకరణ విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? : కోటి మాదిగ

వర్గీకరణ విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? : కోటి మాదిగ

ఎస్సీ వర్గీకరణ అంశంపై పార్లమెంట్లో జరగవలసిన ప్రక్రియను సుప్రీంకోర్టు మీదకు నెట్టి వేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి ? వర్గీకరణ పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యాన్ని కనపరుస్తుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బిజెపి టిడిపి పార్టీలు ఎందుకు వర్గీకరణ సమస్యను పరిష్కరించలేకపోయాయి?
వర్గీకరణ అంశాన్ని పరిష్కరించి ఎన్నికలకు వస్తే మాదిగల ఓట్లు బిజెపి టిడిపి లకు కాకుండా వేరే పార్టీలకు వేస్తారా అని నిలదీశారు. వర్గీకరణ పేరుతో మాదిగ జాతిని రాజకీయంగా ఆర్థికంగా తన కబంధహస్తాలలో ఉన్నట్లుగా చేస్తున్న నాయకునికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ వర్గీకరణ పై ఎమ్మార్పీఎస్ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో మాదిగలను నిర్వీర్యం చేసే విధంగా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ప్రయాణించలేదని విమర్శించారు. తన వ్యక్తిగత స్వార్థం, ప్రయోజనాల కోసం ఎనికల్లో జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, నిర్వీర్యం చేసే విధంగా పావులు కదుపుతున్నారని ,దీనిని గమనించాలని కోరారు. వర్గీకరణ కోసం ఉద్యమాలు చేసిన నాయకత్వం ప్రస్తుతం కనుమరుగయిందని, పేమెంట్ ఉద్యమకారులతో ఉద్యమాలు నడుపుతూ వ్యక్తిగత స్వార్థం, ఆర్థిక అభివృద్ధి, కోసం మాదిగ జాతిని బలి పశువులగా చేస్తున్న వాస్తవాన్ని మాదిగ జాతి గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరి చిరంజీవి మాదిగ, అత్యల శరత్ మాదిగ, పల్లి పోగు త్రిపుర మాదిగ, రేణమాల మాధవ్ మాదిగ, మల్లెల ప్రసాద్, గౌడ్ పేరు అనిల్ మాదిగ నాగయ్య మాదిగ, సాంసంగ్ మాదిగ, బక్కా రాజు మాదిగ, ముంగర నాగార్జున మాదిగ, ఏండ్లూరి చిన్న మాదిగ, రావినూతల ఏసుబాబు మాదిగ, వెంకటేష్, మోజేష్, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version