Home వార్తలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపిరెవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రమేష్ కుమార్ లు సచివాలయంలో అడిషనల్ సి.ఇ.ఓ యం.యన్. హారేంద్ర ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఉద్యోగికి ఫారం 12 అందచేసి వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకొనేలా డి.ఈ ఓ,ఆర్.ఓలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీల వారీగా ఎంతమంది ఎన్నికల విధుల్లో తీసుకున్నారు? ఎంతమందికి ఫారం -12 జారీ చేశారు? తిరిగి పోస్టల్ బ్యాలెట్ కొరకు సంబంధిత ఆర్.ఓ లకు అందజేశారు? తదితర అంశాలపై అన్ని అసెంబ్లీల రిటర్నింగ్ అధికారులతో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ గా రివ్యూ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం ఇష్టం లేని ఉద్యోగి నుండి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ తీసుకోవాలనీ పేర్కొన్నారు.

Exit mobile version