Home వార్తలు అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఆమోదించామని తెలిపారు. పరిశీలన అనంతరం పార్లమెంట్ కు 183 నామినేషన్లు, అసెంబ్లీ కు 939 నామినేషన్లను తిరస్కరించామని పేర్కొన్నారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా నంద్యాల పార్లమెంటు కు 36 నామినేషన్లు.. రాజమహేంద్రవరం పార్లమెంట్ కు అత్యల్పంగా 12 నామినేషన్లు ఆమోదించబడ్డాయన్నారు. నామినేషన్ల ఆమోదం విషయంలో తిరుపతికి అత్యధికంగా 48 నామినేషన్లు..చోడవరం అసెంబ్లీకి అత్యల్పంగా 6 నామినేషన్ల ఆమోదించబడ్డాయన్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని ఆయన తెలిపారు.

Exit mobile version