Home వార్తలు ACB Net: ఏసీబీకి చిక్కిన ఒంగోలు టూ టౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా

ACB Net: ఏసీబీకి చిక్కిన ఒంగోలు టూ టౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా

ACB Net: ఓ పక్క పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నా ఆ శాఖలో కొందరు ఎటువంటి భయం లేకుండా తమ అవినీతిని కొనసాగిస్తున్నారు. జిల్లాలోని కొనకనమిట్ల మహిళా ఎస్ఐ దీపిక అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఘటన మరువక ముందే ఒంగోలు పట్టణంలో మరో ఎస్ఐ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషా ఓ కేసులో విషయంలో బాధితుల వద్ద నుండి రూ.40వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పది రోజుల క్రితమే జిల్లాలోని కొనకనమిట్ల మహిళా ఎస్ఐ దీపిక భార్య భర్తల మధ్య గొడవలో కేసు నుండి నిందితులను తప్పించేందుకు ఓ కానిస్టేబుల్ ద్వారా రూ.45వేలు లంచం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.  

Exit mobile version