Home వార్తలు Chandrababu: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా అంటూ చంద్రబాబు...

Chandrababu: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా అంటూ చంద్రబాబు ఎద్దేవా

Chandrababu: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా అంటూ చంద్రబాబు ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టులను సందర్శిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో భాగంగా ఇవేళ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను సందర్శించారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానంతో నీటి సమస్యలు అధిగమించవచ్చని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ మరమ్మత్తులు చేయలేకపోయిందని విమర్శించారు. గేట్ల మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా కడతారంట అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు చూశాక వైసీపీకి ఎవరూ ఓటు వేయరని అన్నారు. సైతాన్ రాష్ట్రంలో లేకుండా బయటకు పంపిస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయన్నారు. వైసీపీ రౌడీలకు ఇక తన ఉగ్రరూపం చూపిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ రౌడీలు నేరుగా తనతో పెట్టుకోలేక పోలీసులను నేరాల్లో భాగస్వాములన్ని చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులు శాశ్వతం కాదనీ, రాష్ట్రం శాశ్వతం అని గుర్తించి ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తాను తిడుతున్నందుకే సీఎం జగన్ ఇప్పుడు వరద బాధితుల పరామర్శకు బయలుదేరారని అన్నారు చంద్రబాబు. చిత్ర విచిత్ర వేషాలతో మీ బిడ్డనంటూ అధికారం కోసం కాళ్లవేళ్లా పడేందుకు చూస్తారని ఎద్దేవా చేశారు.

జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. సైకో టైమ్ అయిపోయిందని, విధ్వంసం చేసే టైమ్ కూడా అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అయిదు లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులను ఆదుకుని ఉంటే వరి విస్తీర్ణం తగ్గేది కాదని అన్నారు చంద్రబాబు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల సైకో ఓడిపోతాడనీ, ఇది దేవుడు తిరగరాసిన స్క్రిప్ట్ అని అన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే గిద్దలూరుకు వద్దామనుకుంటున్నాడని విమర్శించారు. గిద్దలూరుకు అంబటి వస్తే తిరుగుటపాలో పంపాలని ప్రజలను కోరారు.

Exit mobile version