Home వార్తలు MAA Elections: ప్రకాష రాజ్ కంటతడి.. విష్ణు అరాచకాలపై ఫిర్యాదులు..!!

MAA Elections: ప్రకాష రాజ్ కంటతడి.. విష్ణు అరాచకాలపై ఫిర్యాదులు..!!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్స్ మధ్య ఇప్పటి వరకూ ఆరోపణలు, పత్యారోపరణలతో మాటల యుద్ధంతో రాజకీయం తారా స్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా మంచు విష్ణు ప్యానెల్ మా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అక్రమాలకు తెరలేపింది. దీంతో అలర్ట్ అయిన ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

విశాఖ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్న నటులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లను మంచు విష్ణు బ్యాచ్ సేకరిస్తోంది. ఈ విషయాలను తెలుసుకున్న ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్, జీవితా రాజశేఖర్ తో కలిసి ఆయన కంప్లెయింట్ చేశారు. మా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందజేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుండి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుందని ఆరోపించారు.

నిన్న సాయంత్రం ఒకే వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ లకు డబ్బు కట్టారని, పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేయాలంటే సభ్యుడు వ్యక్తిగతంగా మా కు లేఖ రాసి డబ్బు కట్టాలన్న నిబంధన ఉందని చెప్పారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద పరుచూరి బ్రదర్స్, శరత్ బాబు తదితరుల పేర్లతో ఫీజులనూ విష్ణు తరపు ఓ వ్యక్తే కట్టారన్నారు. వాటికి సంబంధించిన రసీదులను మీడియా ముందు చూపారు ప్రకాశ్ రాజ్. ఆగంతుకులతో మా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. గెలిచేందుకు ఇంత దిగజారుతారా? అని నిలదీశారు. హామీలు ఇచ్చి గెలవాలని విష్ణు ప్యానెల్ కు సవాల్ విసిరారు. ఇంత అసహ్యంగా ఎన్నికలా అంటూ ప్రకాశ్ రాజ్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంపై కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున స్పందించి మాట్లాడాలని కోరారు ప్రకాశ్ రాజ్.   

Exit mobile version