Home వార్తలు స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన,టీడిపి, బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిదులు తమ్మిరెడ్డి శివశంకర్ ,సయ్యద్ రఫీ ,పాతూరి నాగభూషణంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ రఫీ మాట్లాడుతూ…ఎర్రచందనం అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఆరోపించారు. పది లక్షల కోట్ల విలువ చేసే ఎర్ర చందనాన్ని ఎంపి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి విజయనంద రెడ్డిలు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచేసిన జగన్…ఐదేళ్లుగా తన పాలనలో మరో ఐదు లక్షల కోట్లు వెనకేసుకున్నారని మండిపడ్డారు.మరోసారి వైసిపికి అధికారం ఇస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని విజ్ఞప్తి చేశారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు తూట్లు : శివ శంకర్

జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతలు అటవీ,రెవిన్యూ, ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు.శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్ అధికారి ప్రతాప్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వైసిపికి అనుకూలంగా లేని క్వారీ యజమానులకు వందల కోట్ల జరిమానా విధించారని మండిపడ్డారు.వేధింపులు భరించలేక గ్రానైట్ యజమానులు తమ కంపెనీలను మూతవేసే పరిస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనింగ్ మాఫియా పై సమగ్ర దర్యాప్తు చేయిఇస్తామని తెలిపారు.

దోపిడీ సొమ్ముతో ఓటర్లకు వల : పాతూరి నాగభూషణం

అక్రమ ఇసుక ద్వారా దొచుకున్న సొమ్మును ఓటర్లుకు పెంచేందుకు వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారని పాతూరి నాగభూషణం విమర్శించారు.రెట్టింపు సంపాదన కోసం ఇసుకను పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి కోట్ల రూపాయలును కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.అక్రమ తవ్వకాలు వలన 114 మంది మృతి చెందారని వాపోయారు. సామాన్యులు కు ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని తెలిపారు.

Exit mobile version