Sunday, April 28, 2024
Home వార్తలు అర్చకుల మీద దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి : లంకా ప్రసన్న

అర్చకుల మీద దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి : లంకా ప్రసన్న

- Advertisement -

కాకినాడలో పెద్ద శివాలయంలోని ఇద్దరు అర్చకులను వైసీపీ నాయకుడు చేసిన దాష్టీకం చాలా దారుణమైన సంఘటన. ఇది వరకు గుడుల పైన దాడి చేసిన వారు… ఇప్పుడు గుడిలో ఉన్న అర్చకుల పై కాలితో తన్ని దవడ మీద కొట్టడం, ఇంత కన్నా దారుణం ఏమైనా ఉందా అని అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డా. లంకా ప్రసన్న కుమార్ శర్మ ప్రశ్నించారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మనం  ఏ నాగరికంలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్చకుల కాళ్ళు మొక్కే సంప్రదాయం హిందువులదని అన్నారు. అర్చకులపై దాడి చేయడం అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏమీ లాభం లేదని అన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

 దాడిలో గాయపడిన బ్రాహ్మణ అర్చకులకు ప్రకాశం జిల్లా అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం తరపున తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. అదే విధంగా ఏప్రభుత్వం కానీ పార్టీలో నాయకులు లేక వారి అనుచరులు కానీ అర్చకులు పురోహితులు బ్రాహ్మల జోలికి వస్తే ఇక నుంచి తాట తీయటం పనిగా పెట్టుకుంటామని దేశవ్యాప్తంగా  దేవాలయాలకు తాళాలు వేసుకుని అక్కడే నిరసనలు చేస్తాం అని హెచ్చరించారు. ఈ అత్యవసర సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు దీవి హనుమత్ ప్రసాదాచార్యులు, సురపరాజు రాము, పాలుట్ల సాయికృష్ణ, పోగుల దుర్గ ప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి రామరాజు మల్లిఖార్జున శర్మ, కార్యదర్సులు గుడ్లూరి సురేష్, పిడుగు గోపికృష్ణ, పేర్నమిట్ట నరసింహ రావు, దూపాటి రఘురాం, శంకరమంచి శ్రీధర్ తదిరతులు  పాల్గొన్నారు. సంఘ బాధ్యులతో పాటు నగరంలోని బ్రాహ్మణ నాయకులు టీవీ శ్రీరామ మూర్తి, కామరాజుగడ్డ కుసుమ కుమారి, ఎస్ఏటి రాజేష్, వ్యామజాల ప్రసన్న కుమార్, మారుతీ వినయ్ కుమార్, ఎస్ సుజాత తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపి, ఈ విషయంపై ఖండన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...