Thursday, May 9, 2024
Home వార్తలు గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

- Advertisement -

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన మాట్లాడుతూ….కన్నబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవని ….అలాంటిది ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలపడానికి ప్రధాన కారణం కన్నబాబే అని విమర్శించారు.చంద్రబాబు జైల్లో వున్నప్పుడు టీడీపి తమ్ముళ్లు దిగాలుగా వున్నప్పుడు జనసేన అండగా వుందనీ గుర్తు చేశారు.ఎస్సి, ఎస్టి,బీసీ, మైనార్టీలు అందరూ జనసేనకు సమానమే.. తాను కుల రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు.కురసాల కన్నబాబు డొక్కు స్కూటర్ పై తిరిగేవారు అలాంటిది ఇప్పుడు వెయ్యి కోట్లు సంపాదించారని ఆరోపించారు.కాకినాడ రూరల్ లో వేసిన లేఔట్లకు ఒక రేటు, నాన్ లేఔట్లకు ఒక రేటు కు కన్నబాబు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. వాకలపూడి లో నాలుగు ఎకరాల భూవివాదము, డాక్టర్ ఆత్మహత్య ఇలాంటి అనేక దుర్మార్గాలకు కన్నబాబే కారణమని తెలిపారు. ద్వారంపూడి పక్కన కూర్చుని కన్నబాబు ఇలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. వందల కోట్ల ఇసుక దోపిడీ 25 కోట్ల పిడిఎఫ్ రైస్ స్కాం, వాలంటీర్లు బాగా చేశారని మెచ్చుకోవడానికి ₹7,500 కోట్లు, సచివాలయం బిల్డింగ్స్ కి కలర్ వేయడానికి 3,500 కోట్లు, ఆ రంగులు తీయడానికి 1000 కోట్లు, రేషన్ వెహికల్స్ పేరుతో 800 కోట్లు గార్బేజ్ కోసం 1500 కోట్లు, చిక్కీలు పేరుతో 100 కోట్లు, ఇలాగా అనేక వందల కోట్లు దోచుకు తిన్నారని దుయ్యబట్టారు.

వైఎస్ జగన్ ను గద్దె దించడానికి కూటమి నాయకులు పోరాటం చేస్తున్నారన్నారు.తీర ప్రాంతంలో బోట్లలో గంజాయికి అలవాటు ఆయిపోయి కొందరు బోట్లను తగల బెడుతున్నారనీ అన్నారు.
ద్వారంపూడి , కన్నబాబు అంతు తేలుస్తానని శపథం చేశారు.
సూర్యాపేటలో మత్యకారులు 700 ఇళ్లు ఖాళీ చేయించి ల్యాండ్ ను కబ్జా చేసిన కన్నబాబు కొంత మందికే స్థలాలు ఇచ్చారనీ ఎద్దేవా చేశారు.కేవలం కమీషన్ కోసం కొంగోడు బ్రిడ్జి పనులు ఆపేసారనీ,
మా ప్రభుత్వం వస్తే తక్షణమే బ్రిడ్జి వేసే బాధ్యత నానాజీ తీసుకుంటారని హామీ ఇచ్చారు.గంజాయి మాఫీయా పై ఉక్కు పాదం మోపుతామనీ పవన్ హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇంటింకి కుళాయిలు వేయిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాది అవకాశాలు ఇస్తామనీ హామీ ఇచ్చారు.మద్యపాన నిషేదం చేస్తామన్న జగన్ సారా వ్యాపారిలా తయారయ్యారు. చలమలశెట్టి సునీల్ ఐదు ఏళ్లకు ఒక పార్టీ మారతారు. ఇంక తనని ప్రజలేం నమ్ముతారని ఎద్దేవా చేశారు.దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత బాబు ని ప్రక్కనే కూర్చో బెట్టుకుంటారనీ విమర్శించారు. ద్వారంపూడి పిడిఎస్ రైస్ ద్వారా 27కోట్లు దోచేశారు. వైసిపి స్కీములు పేరు చెప్పి కోట్లు దోచేసారన్నారు.
రమణయ్య పేట, వలసపాకల, సూర్యారావు పేట లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నుంచి శుద్ధి చేయని వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదిలేయడం వల్ల మత్యసంపద నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కూటమి అధికారంలోకి రాగానే శుద్ధి చేసి మాత్రమే సముద్రంలోకి వదులేల చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీకి, ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ,టిడిపి నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి, కటకంశెట్టి బాబి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మల బాబు, బీజేపీ నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు, సలాది శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...