Thursday, May 9, 2024
Home వార్తలు హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట మేనిఫెస్టోను విడుదల చేశామని సీఎం జగన్ అన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చామన్నారు. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్లు జమ చేశామన్నారు. నాన్ డీబీటీ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.78 లక్షల కోట్లు, అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.12,609 కోట్లు, వైఎస్సార్ భరోసా కోసం రూ.34,378 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2019 నాటి టీడీపీ మేనిఫెస్టో కాపీని చూపిస్తూ జగన్ విమర్శించారు. ఆ మేనిఫెస్టో పాంప్లెట్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ ఫొటోలను చూపిస్తూ.. అప్పుడు అదే ముగ్గురితో, ఇప్పుడు అదే ముగ్గురితో కొత్త పాంప్లెట్ ను ముద్రించి పంచుతున్నారని విమర్శించారు. గతంలో మేనిఫెస్టోని అందరూ చెప్పేవాళ్లు.. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి, ఒక డాక్యుమెంట్‌ని చూపించేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్‌ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా ఎక్కడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్‌ ఎక్కడ దొరుకుతుంది అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వాన్నమైన పరిస్థితిని మనమంతా చూసాం. 2019 లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్టగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది మనం అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది.

మేనిఫెస్టోని ఇళ్లకు పంపించాం.

- Advertisement -

ప్రతి సంవత్సరం తరువాత ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ… ఇదిగో మా మేనిఫెస్టో.. ఇదిగో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. చెప్పినవన్నీ మీరే టిక్‌ చేయండి అని అడిగాము. మొట్టమొదటి సంవత్సరంలో ఏ 85 శాతమో 86 శాతమో లేక 88శాతమో టిక్‌ చేస్తే, చివరి ఏడాదికి వచ్చేసరికి 99శాతం పైచిలుకు మేనిఫెస్టోను అమలు చేసి మనం ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా మేనిఫెస్టోను పూర్తి చేసి ప్రతి ఇంట్లో చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అంటే అది ఈ 58 నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడుతున్నాను.

- Advertisement -

నవరత్నాల పాలన.

- Advertisement -

నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలోనే, రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు, డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. అవి నేరుగా వారి చేతికే అందడం. ఇదొక హిస్టరీ. రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నాకు చెల్లెమ్మలకు దేవుడి దయతో, మంచి చేయగలిగాము. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వ తాతల ఆత్మాభిమానాన్ని ఎరిగినవాడిగా, వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్‌ డెలివరీ చేసిన పరిస్థితి కూడా 58 నెలల కాలంలోనే. 2019లో మన మేనిఫెస్టో రిలీజ్‌ చేసేటప్పుడు కూడా చాలామంది మనవాళ్లలో కూడా నాతో అన్నారు సాధ్యమేనా అని? ఎందుకంటే 2019లో మనం చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత 58 నెలల్లో మనం ఏవైతే అమలు చేసామో గతంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఈ మాదిరిగా స్కీములు రావడం గానీ, ఈ మాదిరిగా బటన్‌ నొక్కడం గానీ, ముందుగానే క్యాలెండర్లో ఈ నెలలో ఏ స్కీమ్‌ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీము కరెక్ట్‌ గా అందేలా చేయడం గానీ ఇవన్నీ గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి.

హామీల్లో చంద్రబాబు తో పోటీ పడలేకపోయాను.

2014లో నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు విపరీతమైన మోసపూరితమైన హామీలు ఇస్తూ ఉన్నారు. మనం కూడా ఇవ్వకపోతే ఎలా… మన సంగతి మనం చూసుకుందాం ముందైతే హామీలు ఇచ్చేద్దాం… అని కూడా నా శ్రేయోభిలాషులే సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు తాను చేయలేదు. ఆరోజు కూడా నేను చేయగలిగేవి మాత్రమే చెప్పాను. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నాను.నాకు 2014లో అధికారం రాలేకపోయినప్పటికీ చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళుతున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మధ్య తేడా గమనించాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే.. ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అని ఆశతో ఓటు వేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు, ప్రజల ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వాళ్ల నమ్మకంతో ఆడుకోవడమా? వారి మనోభావాలతో ఆడుకోవడంమా? వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ, వారిని చేయి పట్టుకుని నడిపించగలగడమే లీడర్‌షిప్‌ అని తెలిపారు.

మేనిఫెస్టోలో 9 ముఖ్యమైన హామీలు

రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు.
అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు
వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం
వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ
వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంపు
నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు
వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కొనసాగింపు
అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...