Thursday, May 9, 2024
Home వార్తలు అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

- Advertisement -

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారం చేశారు. దుర్గాడ గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా కూటమి పార్టీల జెండాలతో జన సమూహంతో  జంక్షన్ మొత్తం నిండిపోయింది. ఈ సందర్బంగా   వరుణ్ తేజ్ మాట్లాడుతూ…మీ సొంత ఊరు ఏది అంటే పిఠాపురం అని చెప్పుకునే విధంగా మీ అందరూ చూపిస్తున్న ప్రేమ ఉందని అన్నారు.  పవన్ కళ్యాణ్ ఓటమికి కూడా ఎప్పుడు భయపడని వ్యక్తిని కేవలం ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటారని అన్నారు. మీకోసం నిరంతరం ఆలోచించే పవన్ కళ్యాణ్ కు ఓటేసి లక్ష మెజార్టీతో అసెంబ్లీ పంపాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా మే 13 వ తారీకున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తనయుడు గిరీష్ మాట్లాడుతూ మీ రెండు ఓట్లు గ్యాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే గా పవన్ కళ్యాణ్, కాకినాడ జిల్లా ఎం.పి. అభ్యర్థి గా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు గెలిపించాలని కోరారు. ఆయనతో బిజెపి కాకినాడ అధ్యక్షుడు కృష్ణంరాజు,ఉమ్మడి జిల్లాల కార్యదర్శి జ్యోతి శ్రీనివాస్ ఉ న్నారు.రోడ్ షో కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...