Saturday, April 27, 2024
Home వార్తలు ప్రజలనెత్తిన అప్పులు బండ పెట్టినందుకు మీకు ఓట్లేయాలా ? : కొలనుకొండ శివాజీ

ప్రజలనెత్తిన అప్పులు బండ పెట్టినందుకు మీకు ఓట్లేయాలా ? : కొలనుకొండ శివాజీ

- Advertisement -

దేశంలో ముస్లింలను ఆందోళనకు, అభద్రతాభావానికి గురిచేసే సీఏఏ ఎన్‌ఆర్‌సీ అమలుపై వైసీపీ వైఖరి ఏమిటి ? రాష్ట్రంలో ఎన్నికల ముందు కులగణన ఎందుకు చేపట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని ఆంద్రరత్న కార్యాలయంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ….. రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిపించవలసిందిగా కోరేందుకు ఓటర్ల కలవడానికి బస్సుయాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాకనే యాత్ర ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో పెద్దఎత్తున అక్రమాలను హైకోర్టు బట్టబయలు చేసింది. కోట్ల రూపాయలకు పోస్టులు అమ్ముకున్న వైనం సాక్షాధారాలతో సహా బయటపడిరది. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? యువతకు ఉద్యోగాల కల్పనలో దారుణంగా విఫలమయ్యారు. మెగా డీఎస్సీ కాస్తా దగా డీఎస్సీ అవలేదా? గత ఎన్నికల్లో 25మంది ఎంపీలను ఇస్తే… కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. కానీ పార్లమెంటు ఉభయ సభల్లో మీకు 30మందికి పైగా సభ్యులున్నా ఏంచేశారు అని ప్రశ్నించారు. 13 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపేశారు. ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు వేతనాలు, తెచ్చిన రుణాలకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోని పరిస్థితి నెలకొంది. ప్రజలనెత్తిన అప్పులు బండ పెట్టినందుకు మీకు ఓట్లేయాలా? అని పథకాల పేరుతో బటన్లు నొక్కి చిల్లర విదిలించినందుకు మీకు ఓట్లేయాలా? ప్రజలకేం చెబుతారు అని ప్రశ్నించారు.


రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించి… అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని నిర్మాణం కాకుండా కక్ష గట్టారు. భూములు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టారు. చివరికి అమరావతిలో జరిగిన సుమారు 30వేల ఎకరాల భూసేకరణను విరమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం మీకు ఓట్లేయాలా ? గత ఎన్నికల్లో మద్యపాన నిషేధం దిశగా అడుగులేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రేట్లు పెంచి సొంత బ్రాండ్లు సృష్టించి మద్యం వ్యాపారమే మొదలెట్టారు. ఏకంగా చదువు చెప్పే గురువులను మద్యం విక్రయ కేంద్రాల్లో కూర్చోబెట్టేశారు? పెద్ద ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడి అక్రమంగా వేల కోట్లు నొక్కేశారు. మద్య నిషేధం వైపు అడుగులు వేయడమేమో కానీ గంజాయికి, డ్రగ్స్‌కు ఏపీని రాజధానిగా చేసిన ఘనత సాధించారు ఇందుకోసం మీకు ఓట్లేయాలా?వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని పాలన వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు అధికారులు, పోలీసులు అక్రమ సంపాదన కోసం పోటీపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసినందుకు ఓట్లేయాలా? ఇసుక మాఫియా, భూమాఫియా రెచ్చిపోతున్నారు. ఎవరికి రక్షణ లేకుండాపోయింది. దళితులు, ముస్లిం మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ప్రభుత్వ దన్నుతో రౌడీలు రెచ్చిపోయి హత్యలకు పాల్పడినా అడిగే నాథుడే లేడు. బాధ్యత గల ప్రజాప్రతినిధి దళిత యువకుడ్ని చంపేసి వాళ్లింటికి శవాన్ని పార్సిల్‌ పంపించారంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ హత్యలకు కొదవేలేదు. ఎంతోమంది ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు జరిగాయి. హత్యలు జరిగాయి. చిన్న పిల్లల్ని కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

నియంతృత్వ మోదీకి సహకరిస్తున్న వైసిపి

- Advertisement -

దేశంలో రాజకీయ పెనుభూతంలా మారిన ప్రధాని నరేంద్రమోదీ గడచిన పదేళ్లలో ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల వంటి ఎన్నో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. అంబానీ, అదానీ లాంటి సంస్థలకు దేశ సంపదను దోచి పెట్టారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ధనబలంతో పాటు మతాన్ని, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా చేసుకున్నారు. మతప్రాతిపదికన దేశ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి అంతిమంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆగమేఘాల మీద సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా తనకు ప్రశ్నించే ప్రతిపక్షనాయకులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చివరకు కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపజేసి శునకానందం పొందుతున్నారు. తమకు లొంగి పోయిన నేతల (జగన్‌, చంద్రబాబు లాంటివారు) పై ఎన్ని కేసులన్నా వాటికి జోలికి పోవడంలేదు. అంతిమంగా నియంతృత్వ మోదీ సర్కారుకు వైసీపీ అన్నివిధాలుగా సహకరిస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. ఈ స్థితిలో రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిపించవలసిందిగా కోరేందుకు ఓటర్ల కలవడానికి బస్సుయాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైన అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

Most Popular

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...